Connect with us

Telugu

2020 కూల్ సమ్మర్.. 7 డిఫరెంట్ మూవీస్!

Published

on

మొత్తానికి 2019 డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్ మరో రేంజ్ కి వెళ్లిందనే చెప్పాలి. గత కొన్నేళ్లలోనే కంటెంట్ పరంగానే కాకుండా మార్కెట్ పరంగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమ బాలీవుడ్ కి ధీటుగా నిలబడుతోంది. అయితే 2020 లో కూడా అదే తరహాలో మరికొన్ని డిఫరెంట్ సినిమాలు సందడి చేయనున్నాయి. ఏకంగా 7 వినూత్న సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాయి.

ఏప్రిల్ 2న అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమా రిలీజ్ కాబోతోంది. తెలుగులోనే కాకుండా హిందీ తమిళ్ లో కూడా ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయనున్నారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ‘ఉప్పెన’ తో పాటు నాగ చైతన్య – సాయి పల్లవి ల ‘లవ్ స్టోరీ’ కూడా అదే సమయంలో రిలీజ్ కానున్నాయి. ఇస్మార్ట్ హీరో రామ్ ‘రెడ్’ ఏప్రిల్ 9న రిలీజ్ అవుతుండగా శర్వానంద్ ‘శ్రీకారం’ ఏప్రిల్ 24న రాబోతోంది. ఇక మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ మే 1వ తేదీకి వచ్చే అవకాశం ఉంది. మాస్ రాజా మే 8న క్రాక్ తో రాబోతున్న విషయం తెలిసిందే. KGF 2 కూడా మే లోనే భారీగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ 7 సినిమాల్లో దాదాపు 5 సినిమాల డేట్స్ ఫిక్స్ అయినట్లే. సో ఈ సమ్మర్ లో డిఫరెంట్ సినిమాలతో అభిమానులు కూల్ గా సేదతీరవచ్చన్నమాట.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending