Connect with us

Telugu

బెల్లకొండతో అజ్ఞాతవాసి హీరోయిన్!

Published

on

మజ్ను సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన క్యూట్ బ్యూటీ అను ఇమ్మన్యుయేల్. మొదటి సినిమాతోనే టాలీవుడ్ కుర్రాళ్ళ మనసు దోచుకున్న ఈ 22 ఏళ్ళ కేరళ గర్ల్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే 2018లో శైలజా రెడ్డి అల్లుడు సినిమా తరువాత బేబీ ఎందుకో మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు. మంచి కథలను వెతికే క్రమంలో కొంత గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఫైనల్ గా ఈ కేరళ కుట్టి ఒక మంచి అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెక్స్ట్ సినిమాలో అను ఇమ్మన్యుయేల్ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బెల్లకొండ బాబు డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ సభా నటేష్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. మరొక హీరోయిన్ గా బెల్లకొండ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి అను సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరీ ఆ సినిమాతో బేబీ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending