Connect with us

Telugu

భీష్మ ఫినిష్.. ఎమోషనల్ అయిన నితిన్!

Published

on

ఒక ప్రయాణం ఎన్నో చెరగని జ్ఞాపకాలను మిగులుస్తుంది. ఇక సినీ తారల లైఫ్ లో ప్రతి రోజు ఒక స్పెషల్ మూమెంట్ తో మొదలవుతుంది. అందుకే షూటింగ్ అయిపోగానే చాలా మంది భావోద్వేగానికి గురవుతుంటారు. నితిన్ కూడా ‘భీష్మ’ షూటింగ్ పూర్తి చేసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఓ వైపు అనుకున్న పని అనుకున్నట్టుగా పూర్తి చేశామని గర్వపడుతున్నట్లు చెప్పారు.

మరోవైపు చిత్ర యూనిట్ ని ఇక నుంచి మిస్ అవుతున్నాను అనే ఆలోచన భావోద్వేగానికి గురి చేస్తున్నట్లు చెబుతూ.. త్వరలోనే మళ్ళీ అందరం భారీ స్థాయిలో కలుద్దామని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఛలో డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న చిత్రం భీష్మ. సింగిల్ ఫరెవర్ అనే ట్యాగ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పనులు ఇటీవల ముగిశాయి. రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సీతారా ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నగవంశీ నిర్మిస్తున్నారు. మహాథి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending